సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా ..ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ప్రకటించింది. ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబార్డినేట్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (Assistant Statistical Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 196 అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తారు.. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబర్‌ 13 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు మ్యాథమెటిక్స్‌ (Mathematics), ఎకనామిక్స్‌ (Economics), కామర్స్‌ (Commerce), కంప్యూటర్‌ సైన్స్‌ (Computer Science) సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానితో బ్యాచిలర్స్‌ డిగ్రీ (Bachelor’s Degree) ఉత్తీర్ణులై ఉండాలి: విద్యార్హతతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థులు తమ అర్హతను అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనల ప్రకారం నిర్ధారించుకోవాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 2, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక సింగిల్‌-లెవెల్‌ ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ద్వారా జరుగుతుంది. రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు పే స్కేల్‌ లభిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు వర్తించే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *