సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల సౌలభ్యం కోసం భీమవరం హెడ్‌ క్వార్టర్‌ గా నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని నేడు, శుక్రవారం భీమవరం పాత బస్టాండ్ వద్ద పంచాయతీ రాజ్ కార్యాలయంను మొదటి అంతస్తులో జిల్లా కలెక్టర్ నాగరాణి తో కలసి శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు మరియు ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాల క్రితం ఏలూరు లో ప్రారంభమైన ఉమ్మడి జెడ్పీ ఇప్పుడు జిల్లాల విభజన జరిగిన తరువాత ఇప్పుడు భీమవరానికి రావడం సంతోషకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 28 కొత్త జిల్లా పరిషత్లు అందుబాటులోకి వచ్చాయని, భీమవరంలో జెడ్పీ శాశ్వత భవన నిర్మాణానికి వీలుగా రాబోయే మూడు నెలల లోపు స్థల సేకరణ పూర్తి చేసి శంకుస్థాపన చేసేలా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు గతంలో జిల్లా శివారు ప్రాంతాలైన పేరుపాలెం వంటి గ్రామాల ప్రజలు ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంకు వెళ్లాలంటే ఇబ్బంది పడేవారని, ఇప్పుడు భీమవరంలో జెడ్పి ఏర్పాటు కావడం వల్ల కేవలం 30 నిమిషాల నుండి గంట వ్యవధిలోనే జెడ్పీ సేవలు అందుతాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *