సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ప్రజలకు ఇంటికే వెళ్లి ఉన్నత సేవలు అందిస్తున్న వలంటీర్లపై కక్ష తో జనసేన అధ్య క్షుడు పవన్ కల్యాణ్ అవమానకర వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ సీఎస్అజయ్ జైన్ ఉత్తర్వు లు జారీ చేశారు. ఏలూరులో ఈ నెల 9న వలంటీర్లపై, పవన్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహిళల అక్రమ రవాణా చేస్తున్నారంటూ పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంబంధింత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పీపీకి ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్లలో గౌరవంగా పనిచేస్తున్న 53శాతం మంది మహిళలను కించపరిచేలా.. వారు ఒంటరి మహిళను మిస్సింగ్ సహకరిస్తారని అవమానకరమైన, విషపూరిత వ్యాఖ్య లు పవన్ చేసారని, గ్రామ, వార్డు సచివాలయ వ్య వస్థ ను పవన్ అవమానించారని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిం ది. తాజా పరిణామాలపై జనసేన అధినేత పవన్ స్వాందిస్తూ .. జగన్ సర్కార్ తనపై కేసులు పెట్టి తనను అరెస్ట్ చేయవచ్చునని , పోలీసులు తనను హింసించవచ్చునని సిద్ధంగా ఉన్నానని, అయితే . తాము అధికారంలోకి వచ్చాక అవకాశం ఉంటె జగన్ ను తిరిగి చర్లపల్లి జైలుకు పంపుతానని ఆశాభావం వ్యక్తం చేసారు పవన్
