సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతరిక్ష ప్రయోగాలకు రాకెట్ లకు ఇంధనాలు తయారు చేసే సంస్థగా ప్రపంచ ఖ్యాతి గాంచిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ మరో అరుదయిన ఘనత జాతీయ స్థాయిలో సాధించింది. ఆంధ్రా షుగర్స్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్ మార్గదర్శకత్వంలో హార్వెస్టింగ్ మెషీన్ పేరుతో చేసిన ఆవిష్కరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి గాను షుగర్ కేన్ పేటెంట్ వచ్చింది. ఈ మేరకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ఈ నెల 26న పేటెంట్ సర్టిఫె జారీ చేసింది. చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు అయిన దేశం లోనే మొట్టమొదటి సం స్థ ఆం ధ్రా షుగర్స్ కావడం విశేషం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *