సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు& నియోజకవర్గ ఇంచార్జి కొటికలపూడి గోవిందరావు , స్థానిక జనసేనా నేతలు, వీర మహిళలుతో కల్సి భీమవరం – వేండ్ర గేట్ రోడ్డులోని పంపుల చెరువు వద్ద జగనన్న కాలనీను నేడు, శనివారం పరిశీలించారు. అక్కడ ఉన్న ఇద్దరు లబ్దిదారులతో మాట్లాడరు. తదుపరి చినబాబు మాట్లాడుతూ… ఇక్కడ ఇళ్ళా కట్టే స్థలాలు అంటూ ప్రజలకు ఇచ్చిన స్థలంలో చేపల చెరువులను తలపిస్తున్నాయని, లే అవుట్ చేసి ఇళ్లు ఇస్తామని, మోసపూరిత హామీలతో మోసం చేశారని అన్నారు. ఒక్క రోడ్డు తప్ప ఎటువంటి మౌలిక వసతులు లేవని, వాస్తవాలను తెలియజేయాలని ఈ కాలనీని పరిలించామని అన్నారు. ఈ కాలనీని చూస్తుంటే బాధ కలుగుతుందని, జగనన్న ఇళ్ళు లబ్ధిదారులకు కన్నీళ్ళే మిగిలయని అన్నారు. ఇళ్లు కట్టుకొకపోతే ఇచ్చిన స్థలాన్ని తొలగిస్తామనే బెదిరింపులు లబ్ది దారులకు వస్తున్నాయనిఎందుకు ఇప్పటికీ ట్యాంక్ కట్టలేదని, వర్షం నీటితో ఇక్కడ ప్రజలు కాలం గడుపుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వాని కి పబ్లిసిటీ తప్ప పని చేయాలనే ఆలోచన లేదన్నారు. రాష్ట్రంలో 30 లక్షలు పేదల ఇల్లు స్థలాలు ఇచ్చామంటారే తప్ప ఇప్పటికీ లక్ష ఇళ్లు కూడా కట్టలేదు, అన్ని పనులు కూడా అసంపూర్తిగానే చేస్తున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వం పనుల మీద దృష్టి పెట్టండి అంతే గానీ పవన్ మీద కాదు అని, పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు ఒక్క సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో మెడలు వంచి పని చేయిస్తామని హెచ్చరించారు.
