సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా మహిళా మోర్చా కార్య వర్గ్ సమావేశం ను నేడు, శనివారం ,తణుకు బిజెపి ఆఫీస్ లో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించారు, ఈకార్యక్రమంలో మహిళ ప్రవాస్ యోజన కన్వీనర్ కె.శ్రీ సుధ మాట్లాడుతూ… మహిళలకు కేంద్రం బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ నేతృత్వంలో మహిళల కు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. దాంట్లో భాగంగా ఉద్యోగిని స్కీం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి పథకం ద్వారా వ్యాపారం చేసుకునే నిమిత్తము 3 లక్షల రూపాయిలు సబ్సిడీతో ఇస్తున్నారు స్త్రీలు స్వయం సాధికత సాధించాలి అని మహిళ ల కోసం ప్రధాని మోడీ చేస్తున్న కృషి కి మద్దతుగా మహిళలు బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర కె. సుధ , రాష్ట్ర కార్యదర్శి& రాష్ట్ర మహిళా మోర్చా ఇన్చార్జ్ భూపతిరాజు శ్రీనివాసవర్మ , జిల్లా ఇన్చార్జి విజయవాణి , జిల్లా బిజెపి అధ్యక్షుడు నారిన్న తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *