సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నూతన మున్సిపల్ కమిషనర్ గా ఎం శ్యామల పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆమె విజయవాడ నుండి బదలీ అయ్యి భీమవరం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నేడు, గురువారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎం శ్యామల మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆమెకు అభినందనలు తెలుపుతూ.. జిల్లా కేంద్రంగా భీమవరం పట్టణంలో ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించి పట్టణాన్ని మరింత సుంద్రీకరణగా తయారు చేయాలని, ఇది పట్టణంలో ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పరుగులు పెడుతున్న కీలక సమయం అని, నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు
