సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ రేపు, సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం రానున్నారు. ఏర్పాట్లను ఇప్పటికే ఆర్డీవో ఝాన్సీరాణి, తహసీల్దార్ ప్రమద్వర, సీఐ సత్యనారాయణ, ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు పరిశీలించారు. గ్రామం మధ్యలో ఉన్న ప్రదేశాన్ని హెలిప్యాడ్ ఏర్పాటు చేసారు. సీఎం జగన్ గొమ్ముగూడెం స్థానిక నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు గొమ్ముగూడెం, కుక్కునూరు – ఏ బ్లాక్‌కు చెందిన నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇందులో భాగంగానే గొమ్ముగూడెంలో పర్యటన ఖరారు అయినట్టు సమాచారం.
