సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం,భీమవరం టౌన్ స్టేషన్ ,తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ లో 70 కోట్ల పైగా నిధులతో ఆధునీకరణ లో భాగంగా అమ్రృత్ భారత్ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొనడానికి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కు వచ్చిన నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్ కు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే, వేటుకూరి శివరామరాజు, ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) భీమవరం టీడీపీ నేత కోళ్ళ నాగేశ్వరరావు ఉండి నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు, కొత్తపల్లి నాగరాజు తదితరులు స్వాగతం పలికారు.అమ్రృత్ భారత్..ప్రధాని మోడీ శంకుస్థాపన వర్ఛువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి యం.పి లాడ్స్ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్న CSN డిగ్రీ కళాశాల, శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం ,RRDS కళాశాల ను సందర్శించారు. మధ్యాహ్నం నుండి యం.పి రఘురామ కృష్ణంరాజు కుమారుడు భరత్ భీమవరం శివారులో తమ ఇంటి వద్ద అభిమానులు, బంధుమిత్రులను కలుస్తారని సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *