సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం ఉదయం తాడేపల్లి నుండి హెలికాఫ్టర్ లో బయలు దేరిన సీఎం జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం , వీఆర్పురం మండలాల వరద బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు మండలం గొమ్ముగూడెం లో పర్యటన ప్రారంభించారు. వరదబాధితులను చిన్నారులతో ప్రభుత్వ సాయం అందిందా? మీకు ఇంకేం సౌకర్యాలు కావాలి అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్, మాట్లాడుతూ.. అధికారులు వారంపాటు వరదలకు ఎఫెక్ట్ అయిన గ్రామాల్లోనే ఉన్నారు. వరద బాధితులకు నిత్య వసరాలు అందించాం. ఇళ్లు దెబ్బ తిని ఉంటే రూ10 వేలు ఇవ్వాలని ఆదేశించాం.. జీవన భృతికి రూ. 2 వేలు ఆర్థికసాయం చేశాం. ఎక్కడ మాకు సాయం అందలేదు అన్న మాట నాకు వినిపించలేదు . డబ్బు లు మిగుల్చుకోవాలనే ఆరాటం మా ప్రభుత్వానికి లేదు.అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే రోజు పోలవరం ను చంద్రబాబు సందర్శిస్తున్న నేపథ్యం ఫై సీఎం జగన్ మాట్లాడుతూ.. మా తండ్రి వై యస్.. ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు మా హయాంలో పోలవరం శరవేగంగా మంచి క్వాలిటీ తో పూర్తీ అవుతుందని .. నిజానికి పోలవరం నిర్మాణం లో చంద్రబాబు తన హయాంలో అవినీతి డబ్బు కోసం బుద్ధిలేకుండా వ్యవహరించారు. ఆ తప్పులు దిద్దటంతో పోలవరం ఆలస్యమౌతుంది. పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ కేంద్ర సహకారంతో పారదర్శకంగా అమలు చేసి తీరుతాం..అని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ( ఫై తాజగా ఫొటోలో సీఎం జగన్ )
