సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజకీయాలకు అతీతంగా ఒప్పుకోవాల్సిన మాట.. గతంలో సామాన్యుడు తన కుటుంబం కోసం రేషన్ కార్డు పొందాలంటే దానికి పడే కష్టం, బ్రహ్మ ప్రళయం.. అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవలసి వచ్చేది.. మరి ఇప్పడు .. జగన్ సర్కార్ హయాంలో ప్రతి ఆరు నెలలకోసారి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. అయితే మరో 8 నెలలలో ఎన్నికలు సమీపిస్తున్న వేళా మరింత వేగంగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో గతనెలలో ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో వాలంటీర్లు సహకారంతో అర్జీలు పెట్టుకొన్న 9,372 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని సమాచారం. వీరికి వచ్చే నెల నుంచి బియ్యం రేషన్ అందిస్తారు. వీటిలో భీమవరం రెవెన్యూ డివిజన్లో 10 మండలాలకు 4,627, నరసాపురం డివిజన్లో 10మండలాలకు 4,745 కార్డులు మంజూరయ్యా యి. కొత్తగా పెళ్లయిన దంపతులకు, ఉమ్మ డి కుటుంబం నుంచి విడిపోయి కొత్త కాపురం పెట్టిన దంపతులకు కూడా తక్షణం కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీని వల్ల పలు కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పధకాలు కు కూడా అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *