సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గత 10 రోజులు క్రితం కురిసిన వానలు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మరల కానరావడం లేదు. మధ్యాహ్నం భీమవరం రోడ్లపై జనసంచారం కానరావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మళ్లీ ఎండలతో సెగలు కక్కుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో రికార్డవుతున్నాయి. కొద్దిరోజుల నుంచి ఉష్ణ తీవ్రత అధికమై పగటి పూట ఎండ చుర్రుమంటోంది. వర్షాకాలం లో ఇలాం టి వాతావరణం అరుదుగా కనిపిస్తుం ది. గత 2వారలు క్రితం బం గాళాఖాతం లో ఏర్ప డిన అల్ప పీడనం బలహీనపడిన తర్వా త రాష్ట్రంలో ఈవాతావరణం నెలకొంది. ఆగస్టు మొదటి వారంలో అల్ప పీడనాలు ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు వానలకు బదులు ఎండలు కాస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం పైకి నైరుతి గాలులు వీస్తున్నాయి. అయితే తేలికపాటి జల్లులే తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. అయితే ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు ఉండవచ్చని, వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
