సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గాజువాక జంక్షన్‌లో నేటి ఆదివారం రాత్రి వారాహి విజయయాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం విశాఖ వైసీపీ ఎంపీ సత్యనారాయణ ఒక రౌడీ షీటర్. చర్చి ఆస్తులు దోచేస్తున్నారు. నేను ఎవరో బెదిరిస్తే భయపడే వ్యక్తి ని కాదు.. రాష్ట్రాన్ని “దోపిడీ చేసే వ్యక్తి జగన్‌కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారు. నేను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా?అనిపించింది. నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేనే స్వయంగా 2చోట్ల ఓడిపోయాను. అయితే నా ఆశయం ఓడిపోలేదు. గాజువాకలో ఓడిపోయినా.. నాకు ఇప్పుడు ఘన స్వాగతం పలికారు. ఓడిపోయినా తర్వాత ఒక ఆశయంతో పనిచేస్తున్నాను. జనసేనకి మీరు అండగా నిలబడతారు. నేను ప్రధాని మోడీ కి విశాఖ ఉక్కు ప్రేవేటి కరణ వద్దు అని చెప్పాను , కానీ ఎంపీలు లేని నేను ఎలా ప్రవేటీకరణ అడ్డుకోగలను? 30 కి పైగా పార్లమెంట్ ఎంపీలు ఉన్న వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తే ప్రయోజనం తాప్పకుండా ఉంటుంది. కానీ ఆంధ్ర ఎంపీలు అమ్ముడుపోతారని ఢిల్లీలో విన్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గుండె కొట్టు కుంటుంది. విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన వారు. గుడిలో ప్రసాదం తింటున్నారు.కేసులు ఉన్న వాడికి, లూటీ చేసే వాడికి ధైర్యం రాదు. అందుకే కేంద్రాన్ని ఏం అడగలేక పోతున్నారు. ఆం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని జగన్ మాట్లాడరు” అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *