సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక భీమేశ్వర స్వామి గుడి వద్ద R R & ఫ్రెండ్స్ సేవా సమితి భీమవరం వారి ఆధ్వర్యంలో రక్తమే ప్రాణా దారంగా జీవిస్తున్న తలసేమియా వ్యాధి గ్రస్త చిన్నారులు కొరకు స్వచ్చంద రక్తదాన శిబిరము ఆనంద బ్లడ్ బ్యాంక్ వారిచే ఏర్పాటు చేయుట జరిగినది. ఈ రక్తదాన కార్యక్రమంలో 15 మంది దాతలు రక్తదానము చేసారు. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా భీమవరం వన్ టౌన్ సీఐ, అడబాల శ్రీను గారు మరియు సంఘసేవకులు శ్రీ చెరుకువాడ రంగ సాయి పాల్గొన్నారు. C.I అడబాల శ్రీను మాట్లాడుతూ .. తలసేమియా వ్యాధిగ్రస్థులకు కొరకు రక్తదాన శిభిరం ఏర్పాటు చేయడం చాల అభినందనీయమని నిర్వహకులను అభినందించారు. రంగసాయి, సంస్థ గౌరవ అధ్యక్షులు శ్రీ ఆనంద రఘ వర్మ, రక్తదనం చేసినవారికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ తూర్పు కాపు సంఘ సహాయ కార్యదర్శి తాళ్ళపూడి పరమేశ్వరరావు, గెద్దా రామారావు, కొడమంచలి సిద్దయ్య, ఋరిడి సత్య వర ప్రసాదు, తోటశ్రీనివాసు, మామిడిపల్లి వినయ్ కుమార్, కారుమూరి సతీష్, కోరాడ అప్పల నాయుడు. పొన్నాడ రామారావు, జలసూత్ర శివ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *