సిగ్మాతెలుగు డాట్, న్యూస్: ఇటీవల విద్యుత్ శాఖ ఉద్యొగులు చేస్తున్న ఆందోళనలు దృష్ట్యా ఏపీ లో జగన్ సర్కార్ తాజగా నేడు, బుధవారం విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలను భారీగా పెం చుతూ శుభవార్త ప్రకటించింది. దీనితో ఉద్యో గులు హర్షం వ్య క్తం చేస్తున్నారు. తాజా వివరాల ప్రకారం.. ఏపీలో విద్యుత్ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్ శాఖ ,స్పెషల్ పి ఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 27వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యో గులకు అదనపు లబ్ధి చేకూరనుంది. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ఏజెన్సీలను ఆదేశించింది.
