సిగ్మాతెలుగు డాట్, న్యూస్: భీమవరం బ్రాండ్, వివాదాస్వాద చిత్రాల సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. టీజర్ 2 విడుదలయి తీవ్ర సంచలనం రేపుతోంది, టీజర్ లో సన్నివేశాలు బట్టి వర్మ చుసిన కోణంలో .. మాజీ సీఎం వై యస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ ను సీఎం కాకుండా కేసులు బనాయించి జైలుకు పంపడం వెనుక పనిచేసిన రాజకీయ శక్తులు, రాష్ట్ర విభజన కు దారితీసిన పరిణామాలు, సమైక్య ఆంధ్ర కోసం జగన్ జైలులో చేసిన నిరసన దీక్ష.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అవిశ్వాస తీర్మానం పెట్టి చేసిన ప్రయత్నం.. అదే సమయంలో ప్రజా రాజ్యం పార్టీలోని 18 మంది ఎమ్మెల్యేల తో సహా చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ కు అండగా నిలబడిన సన్నివేశాలు వర్మ “కసిగా”మంచి వాడివేడిగా చిత్రీకరించినట్లు అర్ధం అవుతుంది. ఈ టీజర్ లో జగన్తో పాటు పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, సోనియా గాంధీ, రోశయ్య , మన్మో హన్ సింగ్..జేడీ లక్ష్మీనారాయణ లను పోలిన అనేకమంది పాత్రలను చూపించాడు. ‘నిజం తన షూ లేస్ కట్టుకునేలోపే.. అబద్దం ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వస్తుంది’ అని జగన్ పాత్ర దారి అజ్మల్ అమీర్ చెప్పడం, అలాగే చివర్లో లాస్ట్ పంచ్ అన్నట్లు , చంద్రబాబు తరహా పాత్రధారితో ఓ వ్యక్తి ‘ఎప్పుడో అప్పుడు మీరు కళ్యాణ్ ను కూడా వెన్ను పోటు పొడుస్తారుగా’ అని అడగ్గా.. ‘వాడికంత సీన్ లేదు. తనను తానే పొడుచుకుంటాడు’ అని అన్న డైలాగ్ భారీగా ట్రోల్స్ అవుతుంది, రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *