సిగ్మాతెలుగు డాట్, న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికి సంచలన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన స్వర్గీయ వంగవీటి మోహనరంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైందని.. తన మిత్రుడి బంధువుల అమ్మాయినే వంగవీటి రాధ వివాహమాడబోతున్నారని ఆయన బంధువర్గాల సమాచారం.. ఈ నెల 19న నర్సాపురంలో నిశ్చితార్థం, సెప్టెంబర్‌లో రాధాకృష్ణ వివాహమని బంధువర్గాల సమాచారం. అయితే ఆయన వ్యక్తిగతంగా ఇంకా ప్రకటించలేదు. ఆయన టీడీపీ లో ఉన్నప్పటికీ కొంతకాలం పాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ వంగవీటి రాధ వివాహ వేడుకలలో మాత్రం అన్ని పార్టీల నుండి కీలక నేతల మల్టీస్టార్ కాంబినేషన్ ఉండే అవకాశం లేకపోలేదు,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *