సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శేషాచల కొండలలో భక్తులు నడకమార్గంలో పులులు, ఎలుగు బంటులా సంచారం ఇటీవల ఎక్కువ కావడం .. ఇటీవల చిరుత పులి దాడిలో ఒక బాలుడు గాయపడటం, మరో బాలిక మృతి చెందటం నేపథ్యంలో ..దేవస్థాన అధికారులు అలర్ట్ అయ్యారు. తాజగా.. శ్రీ నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్‌లో మరో చిరుత చిక్కింది. గతంలో బాలిక పై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో మరో చిరుత చిక్కడం గమనార్హం. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం అనుమానాస్పద ప్రదేశాల్లో బోన్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చిరుతను బంధించేందుకు మూడు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట, లక్షీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులను ఏర్పాటు చేయడం జరిగింది. 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించడం విశేషం. కొండపైకి వాహనాలు తిరిగియే ఘాట్ రోడ్డులో కూడా ద్విచక్ర వాహనదారులపై చిరుతలు దాడి ప్రయత్నించడం, వాహనాలు ఢీ కొని చిరుతలు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి.. కాబట్టి టీటీడీ బోర్డు భక్తులను ఇబ్బంది పెట్టకుండా దీనికి సమర్ధవంతమైన తరుణోపాయం ఆలోచించాలి..
