సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నా మట్టి – నా దేశం కార్యక్రమములో భాగంగా జిల్లా కలెక్టర్, భీమవరం మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ పి.ప్రశాంతి ఆదేశముల మేరకు నేటి గురువారం సాయంత్రం గంటలకు బివి రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీరమ్మ పార్క్ వద్ద శిలా పలకం ఆవిష్కరణ కార్యక్రమం లో మరియు స్వతంత్ర సమర వీరులకు వందనం కార్యక్రమం లో ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొన్నారు, అనంతరం పి ఎస్ ఎమ్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు తో కలసి కెనాల్ ను శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభించారు. తదుపరి పార్క్ ఆవరణలో అధికారులతో మాట్లాడుతూ..ఎంతో ఆధునిక వసతులతో నిర్మించిన పార్క్ కు ప్రజలను ఆహ్లదం కలింగించే పార్క్ ఆవరణలో శుభ్రత తో పాటు ఎటువంటి ట్రాఫిక్ రద్దీ లేకుండా చూడాలని బండ్లపై వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారస్తులు కు నిర్దేశించిన జోన్ లో వ్యాపారాలు చేసుకొనేలా మరియు చెత్త ఇక్కడ వెయ్యకుండా సూచనలు ఇవ్వాలని కమిషనర్ ఎం శ్యామల దేవికి ఇతర మునిసిపల్ అధికారులను ఆదేశించారు.
