సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో గత గురువారం రాత్రి .. జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ, గీత కులాల సాధికార కమిటీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. దీనిలో టీడీపీ బిసి వక్తలు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో జగన్ సర్కార్ బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది. బీసీలకు 56 కార్పొరేషన్‌లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బిసిలను అవమానించారని ఆరోపిస్తూ.. బీసీలు గీత వృత్తిదారులకు రాజకీయపరంగా వచ్చే హక్కులు సాధించాలంటే మరల బిసి ఒక్కతాటిపై ఉండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి. ఆయన టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ ల అభివృద్ధి తో పాటు గీత కులాలకు మద్యం వ్యాపారంలో ప్రభుత్వపరంగా రావాల్సిన 21 శాతాన్ని తీసుకు వస్తాం’ అని ప్రకటించారు. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి , మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి పీతల సుజాత,మండలి మాజీ చైర్మన్ ఎండీ షరీఫ్,ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, టీడీపీ డ్వాక్రా సంఘాల కార్యదర్శి మేరగాని నారాయణమ్మ, భీమవరం పట్టణ, మండల అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యంరాజు,,ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఇంకా జిల్లా బిసి మరియు, గౌడ, శెట్టిబలిజ, శ్రీశయన, యాత, ఈడిగ కులాల టీడీపీ నేతలు పాల్గొన్నారు.
