సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి దేశంలో ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలకు బాటలు వేయాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పెన్మెత్స దుర్గాభవాని పేర్కొన్నారు. “బద్లావ్ జరూరీ హై–మార్పు కావాలి” నినాదంతో సీపీఐ దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు చేపట్టిన పాదయాత్రల్లో భాగంగా నేడు, గురువారం భీమవరం ప్రకాశం చౌక్‌లో పశ్చిమ గోదావరి జిల్లా పాదయాత్రను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలలో ఓట్ల చోరీ నేపథ్యంలో ఈవీఎం లను ప్రక్కన పెట్టి , ఎన్నికలను తిరిగి బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమరావు తదితరాలు పాల్గొన్నారు.
