సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీఈడీ పూర్తీ చేసినవారికి శుభవార్త..భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ(ఏడబ్ల్యూఈఎస్‌) …దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో టీచర్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ఆన్‌లైన్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేటాయించిన పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), ప్రైమరీ టీచర్‌(పీఆర్‌టీ)
అర్హత: పీజీటీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రైమరీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా(ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌)/బీఈడీ పాసై ఉండాలి.వయసు: 2021 ఏప్రిల్‌ 01 నాటికి ఫ్రెషర్స్‌ వయ సు 40 ఏళ్లు మించకూడదు. ఐదేళ్లకు తగ్గకుండా టీచింగ్‌ అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థుల వయసు 57 ఏళ్లకు మించకూడదు.దరఖాస్తు విధానం,పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో ఉంటుంది. ప్రశ్న పత్రంలో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.365 చెల్లించాలి దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 28. స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలు: ఫిబ్రవరి 19, 20
వెబ్‌సైట్‌: https://www.awesindia.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *