సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగాభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర ఆరోపణ చేశారు. గతంలో లోకేశ్ నన్ను టీడీపీ పార్టీలోకి రావాలని కోరారు. నేను నిబద్ధత కలిగిన నాయకుల వెంటే ఉంటానంటూ ఆఫర్ ను తిరస్కరించా. పైగా తండ్రి కొడుకుల అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాను. అందుకే వాళ్లు నాపై కక్షగట్టారు. అందుకోసమే తనపై పరువునష్టం దావా వేశారని.. ఈ కేసులో మంగళగిరి కోర్టుకు వెళ్లివచ్చే సమయంలో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే దానికి లోకేశే కారణమని ఇదే తన మరణ వాంగ్మూలంగా భావించాలన్నా రు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యా దు చేస్తున్నట్లు తెలిపారు. . నేను ఎప్పుడో కంతేరులో లోకేశ్ భూములు కొన్నారని చెప్పానట. దానిని పట్టుకుని నాపై రూ.4 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. రెండేళ్లు జైలుశిక్ష కూడా వేయిస్తారట. కంతేరులో హెరిటేజ్ పేరిట భూములు కొన్నది వాస్తవం కాదా? లోకేశ్ కుటుంబ సభ్యులు కొంటే నీకు సం బం ధం లేదా? మీ తల్లి, భార్య పేరు మీద ఉన్న ఆస్తులు ఎవరికి లోకేశ్? అని ప్రశ్నించారు, గతంలోనే లోకేశ్ బతుకును వపన్ కళ్యాణ్ రోడ్డున పడేశారు. లోకేష్ మంత్రిగా ఉన్నపుడు ప్రతి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం చేశారంటూ పవన్ చేసిన వ్యాఖ్య లు మర్చి పోయారా? అని ప్రశ్నించారు పోసాని కృష్ణ
