సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర బీజేపీ అధిష్ఠానం.. పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీని ప్రకటించారు. పార్టీ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డిని నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్ చుగ్, OBC మోర్చా నూతన ఉపాధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్య మరియు సభ్యునిగా భీమవరం కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ పేర్లను ప్రకటించింది. ఈ సందర్భముగా వారికీ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ శుభాకాంక్షలు తెలిపారు.అయితే బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. పైగా ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను తప్పించారు.
