సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో నేటి సోమవారం జూనియర్ డాక్టర్ల నిరసనలు ఉధృతమయ్యాయి. తమ సమస్యలు ఆగస్టు 15 లోగ పరిష్కారిస్తామని చెప్పిన ప్రభుత్వం నుండి ఇప్పటికి పరిష్కారానికి సరైన స్పందన లేదంటూ నేటి సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు. ఐసీయూ సేవలు, ఎమర్జెన్సీ సేవలు, ఆపరేషన్ థియేటర్లలో సేవలను బహిష్కరించారు. దీంతో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా.. ప్రభుత్వ ఆస్పత్రి యాజమాన్యాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ సహా పలు వైద్యసేవలపై ప్రభావం పడుతోంది. జూనియర్ వైద్యుల విధుల బహిష్కరణతో ఆస్పత్రి యాజమాన్యాలు సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్లు, అసిస్టెంట్ సర్జన్లతో సేవలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *