సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు సినిమా సాధించిన అవార్డుల ప్రభంజనం మాములుగా లేదు. నేటి గురువారం సాయంత్రం ప్రకటించారు. భారతీయ సినిమా అంటే తెలుగు సినిమా అంటూ బాహుబలి తరువాత ఇక తగ్గేదే లేదు అంటూ..ప్రపంచ స్థాయిలో అనేక ఘన విజయాలు చాటి చెప్పాయి. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా లో హీరోగా నటించిన అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు పురస్కారం లభించింది. అలాగే జాతీయ సాయి బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌- RRR అవార్డు దక్కించుకోగా బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌-దేవీశ్రీప్రసాద్‌(పుష్ప), బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌- కీరవాణి (RRR), బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌- ప్రేమ్‌ రక్షిత్‌ (RRR), బెస్ట్‌ లిరిక్స్‌ , కొండపొలం(చంద్రబోస్‌), బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌- కాళ భైరవ(RRR) దక్కించుకోగా ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన గెలుచుకోవడంతో తెలుగు సినిమా దేశంలో తన స్థాయి ఏంటో చెప్పకనే చెప్పింది. ఇక ప్రతిష్టాకరమైన ఉత్తమ నటుడు అవార్డు సాధించిన అల్లు అర్జున్, ఈ అవార్డుకు అదే అవార్డు విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ (ఆర్‌ఆర్‌ఆర్) రామ్ చరణ్ (తెలుగు) ఆర్ఆర్ఆర్, సూర్య (తమిళం) — జై భీం, ధనుష్ (తమిళం) — కర్ణన్ లతో పోటీ పడ్డారు. ఈ అవార్డుల ప్రకటనలతో తెలుగు సినీ పరిశ్రమలో సంబరాలు చేసుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *