సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని నేడు శుక్రవారం భీమవరం లో వాడవాడలా గాంధీ విగ్రహాలకు పుష్ప మాలలు వేసి ప్రజలు నేతలు ఘన నివాళ్లు అర్పించారు. ఈరోజు మాంసాహారం అమ్మకాలను పట్టణంలో నిషేదించారు. ఈ నేపథ్యంలో మునిసిపల్ కార్యాలయ ప్రాంగణంలో గాంధీజీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు , మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పలువురు నేతలు అధికారులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ దేశ స్వాతంత్ర్య సముపార్జన కోసం చేసిన అపార త్యాగాలను, దేశ ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, క్రమశిక్షణ మరియు సేవాభావం వంటి మహోన్నత విలువలు సమాజానికి శాశ్వత మార్గదర్శకాలని పేర్కొన్నారు.
