సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: డి.ఎన్.ఆర్. కళాశాలలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి, భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలను కళాశాల ఎన్.ఎస్.ఎస్. యూనిట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాజగా జరిగిన దంతులూరి నారాయణరాజు విద్యాసంస్థల పాలకవర్గ సభ్యుల సమావేశంలో అధ్యక్షులు గోకరాజు వెంకటనరసింహారాజు, కార్యదర్శి గాధిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. కేంద్ర స్టీల్ మరియు భారీ పరిశ్రమల సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రోద్బలం మరియు సహకారంతో స్దానిక దంతులూరి నారాయణరాజు కళాశాల అసోసియేషన్ ఆద్వర్యం లో డి.యన్.ఆర్ కాలేజ్ ఆప్ నర్సింగ్ ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. డీఎన్ ఆర్ విద్యాసంస్థలలో దశాబ్దాలుగా విద్యార్దులకు సాదరణ విద్య , సాంకేతిక విద్య, న్యాయ విద్య, బోదనా విద్య లను అందిస్తున్నామని అంతేకాక వారికి పేరొందిన సంస్దలలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని అన్నారు. ఇకపై వైద్య, ఆరోగ్య రంగాలలో కూడా బి.యస్.సి (నర్సింగ్) కోర్సు ను విద్యార్దులకు అందించేందుకు పాలకవర్గం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. అనేక కళాశాలల యాజమాన్యాలు నర్సింగ్ కాలేజి ఏర్పాటుకు ప్రయత్నాలు చేసుకుంటున్నప్పటికిని, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తాను చదువుకున్న, ఉద్యోగి గా పనిచేసిన , జాయింట్ సెక్రటరీ గా సేవలు అందించారని, ఇప్పుడు తాజగా నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతి తీసుకు వచ్చారని తెలిపారు
