సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ తరపున నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంగా గన్నవరంలో బహిరంగ సభ నిర్వహించిన బహిరంగ సభలో దుర్భాష పూరిత ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతలపై తాజగా.. కేసులు నమోదు అయ్యాయి. సభా వేదిక నుంచి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి పేర్ని నాని పిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడి విడిగా కేసులు నమోదు చేశారు. రంగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ.. కుక్కలు..ఇంకా వ్యంగ వ్యాక్యలు చేసిన అయ్యన్న పాత్రుడు ఫై కేసు నమోదు అయ్యింది. ఇక ముఖ్యమంత్రి జగన్ ను సైకో, ధన పిశాచి, పనికిమాలినవాడు అంటూ దుర్భాషలు చేశారన్న ఆరోపణలపై బుద్ధా ఫై కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153a, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు కాగా.. బుద్దా వెంకన్న పై 153, 153a, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.
