సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని మెంటే వారి తోట నుండి బైపాస్ రోడ్డు ను కలుపుతూ సరికొత్త విశాలమైన సీసీ రోడ్డు దాదాపుగా నిర్మాణం పూర్తీ అయ్యి అధికారికంగా ప్రారంభం కానప్పటికీ ( ఇంకా దానికి కొనసాగింపు రోడ్డు నిర్మాణాలు ఉన్న నేపథ్యంలో) ఇప్పటికే వాహనదారులకు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. వండర్ కిడ్స్ స్కూల్స్ నుండి బై పాస్ వరకు సుమారు కిలో మీటర్ మేర రోడ్డుకు ఇరువైపులా 4 నెలల క్రితం స్థానిక ప్రజల సహకారంతో ,ఆక్రమణలను, చెట్లను తొలగించడమే కాదు.. అంతే శరవేగంగా విశాలంగా నిర్మించిన ఈ సీసీ రోడ్డుపై వాహనాలు కూడా ఇకపై అంతే శరవేగంగాబైపాస్ వైపు రాకపోకలు కొనసాగిస్తున్నాయి, గత ఏడాది మెంటే వారి తోట మీదుగా 3 రైల్వే అండర్ టర్నల్స్ నిర్మించడం తో ట్రాఫిక్ రద్దీ మెంటే వారి తోటమీదగా దారుణంగా పెరిగిపోవడం దానికి తోడు ప్రస్తుతం రోడ్డు స్థానంలో భారీ గుంతలతో ఉన్న పాత రోడ్డుపై తరుచు ట్రాఫిక్ ఆగిపోయి వాహనదారులకు చుక్కలు కనిపించేవి, దానితో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చొరవతో ( ఈ రోడ్డు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని, నిధులు కేటాయించాలని ప్రతిపాదనలను ఇచ్చి, గత ఏడాది సెప్టెంబర్ 12 న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కలసి ఆయన అభ్యర్ధించడం కూడా జరిగింది. మొత్తానికి కోట్ల రూపాయల వ్యయంతో గత ఏడాది బైపాస్ రోడ్డు ఆధునీకరణ చెయ్యడం ఇప్పుడు తాజగా మెంటే వారి తోట నుండి బైపాస్ ను కలిపే ఈ ప్రధాన రోడ్డును ఆధునికముగా నిర్మించడం తో ట్రాఫిక్ రద్దీ తగ్గటంతో పాటు మెంటే వారి తోట ప్రధాన కూడలిగా అభివృద్ధిలో రూపురేఖలు మారిపోయాయి,
