సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ప్రసిద్ధి చెందిన ఉత్సవాలలో ఒకటైన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 58 వ వార్షిక ఉత్సవాలు కు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా పూర్తీ అవుతున్నాయి. ఈ నెలరోజుల ఉత్సవాలను ఎంతో కష్టమైన ఇష్టంగా నిర్వహిస్తున్న స్థానిక నీరుల్లి కూరగాయలపండ్ల వర్తక సంఘం వారు ఈ ఉత్సవాలకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేసారు. ఈ నెల 13వ తేదీన ఉత్సవాలు ప్రారంభమయి, ఫిబ్రవరి 11వ తేదీ న భక్తులకు అఖండ అన్నసమారాధన తో ముగుస్తాయి. ముందుగా 33 రోజులు ఉత్సవాలు చేస్తారని భావించినప్పటికీ స్వల్ప మార్పుతో .. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 30 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ పారాణిక నాటక ప్రదర్శనలు, మ్యూజికల్ నైట్స్, సాంప్రదాయ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూలు ను పోస్టర్ లో పొందుపరిచారు.
