సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిసెంబర్ లో లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యంగా వంటిల్లు లో మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేడు, మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి ‘అనురాగ్ ఠాకూర్’ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. LPG సిలిండర్ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్ ధర రూ. 200 తగ్గనుంది. దీనితో గ్యాస్ సిలెండర్ ధర ప్రస్తుతం 1150 రూపాయలు ఇకపై 950 రూపాయలకు అందనుంది. డెలివరీ ఛార్జి అదనం..అంతే కాకుండా పీఎం యూవై వినియోగదారులు ప్రస్తుతం ఉన్న సబ్బిడీతో కొత్త తగ్గింపు పొందుతారు. కావున వీరికి రూ. 400 తగ్గింపు లభిస్తుంది’ అని
తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *