సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాస్తో కూస్తో కలెక్షన్స్ రాబట్టిన రోబో 2 సినిమాతో 5 ఏళ్ళ క్రితమే రజనీకాంత్ పని అయ్యిపోయింది. తరువాత ఒక్క హిట్ కాదుకదా తెలుగులో ఆయన సినిమా పేరు చెబితే థియేటర్స్ కు వెళ్లే ప్రేక్షకులే కరువైన నేపథ్యంలో.. మరల రజని కాంత్ కి 72ఏళ్ళ వయస్సులో పునర్ వైభవం వచ్చేసింది. ఇటీవల విడుదలై రికార్డులు సృష్టించిన సినిమా ‘జైలర్’ మరలా కోట్ల రూపాయలు కొల్లగొట్టింది.ఈ సినిమాలో పుష్ప తరువాత మరోసారి విలన్ గా నటించిన భీమవరం బుల్లోడు సునీల్ కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. నెల్స న్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఈ ‘జైలర్’ చిత్రం ఎప్పుడెప్పు డు ఓటీటీలోకి వస్తుందా? అని అభిమానులంతా ఎదురుచూశారు. ఆగస్టు 10న రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ‘అమెజాన్ ప్రైమ్ విడియో’ వేదికగా సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వస్తోంది.
