సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: అమరావతి లో తెలుగు దేశం పార్టీ నేతలతో నేడు, మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు .. ఒకనాటి ప్రజా రాజ్యం అధినేత చిరంజీవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లో మన టీడీపీ అధికారంలోకి వచ్చేది అన్నారు. అసలు అపట్లో చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని, అయితే ఎందుచేతనో ఆయనకు స్వంత పార్టీ పెట్టాలనిపించిందన్నారు. ఇటీవల కూడా చిరంజీవి తనతో బాగానే ఉన్నారని చెప్పారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగమన్నారు. టీడీపీ ఈ-పేపర్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు ఏపీలో సినిమా రేట్ల వివాదంపై స్పందించారు. ఇటీవల సినిమా టికెట్ల రేట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారని వ్యాఖ్యానించారు. నిజానికి టీడీపీకి సినీ పరిశ్రమ పూర్తిగా సహకరించింది లేదని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు, ఈ మధ్య కూడా తనకు వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తీశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *