సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నారా లోకేష్ 204 వ రోజు టీడీపీ యువగళం పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, ఉండి నియోజకవర్గ పరిధిలోని కోలమూరు గ్రామా శివారు క్యాంప్ సైట్ నుండి తన పాదయాత్ర ను ప్రారంభించారు. గ్రామా గ్రామాన ప్రజలకు టీడీపీ కార్యకర్తలకు అభివాదములు చేసుకొంటూ .. ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు లు అటు ఇటు తోడుగా నడుస్తుండగా లోకేష్ నేటి మధ్యాహ్నం ఉండి కోట్ల ఫంక్షన్ హాలు కు (భీమవరం వైపు రోడ్డులో) చేరుకొన్నారు. అక్కడ భోజనాలు అయ్యాక ఆక్వా వ్యవసాయ, వ్యాపార రాజధాని భీమవరం జోన్ లో ఆక్వా రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటున్నారు. భీమవరం నుండి ఇప్పటికే జిల్లాటీడీపీ పార్టీ అడ్జక్షురాలు తోట సీతారామ లక్ష్మి, మెంటే పార్ధసారధి తో సహా భీమవరం నేతలు ఇక్కడకు చేరుకొన్నారు.తాము ఎన్నికలలో గెలచి అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు ఏమి సబ్సిడీలు ఇవ్వగలరో నారా లోకేష్‘ ఇక్కడే హామీల ప్రకటన చేసే అవకాశం ఉంది.
