సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోడీ అభిమాన పాత్రుడు అయిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అతి త్వరలో గవర్నర్ కాబోతున్నారంటూ ఇటీవల పెద్ద ఎత్తున తమిళనాట ప్రచారం ఊపందుకుంది. ఈప్రచారంపై అందరు రజనీకాంత్ స్వంత సోదరుడు గా భావించే సత్యనారాయణ తాజగా మాట్లాడుతూ.. .రజనీకాంత్ రాజకీయాల్లో చేరబోరని అలాగే ఇటీవల తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో రజనీ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని తెలిపారు. రజనీకి గవర్నర్ పోస్ట్ రాబోతుందా? అన్న ప్రశ్నకు అంతా దేవుడి చేతుల్లోఉందని పేర్కొన్నారు. గవర్నర్ పదవి రావాలని ఆశలు పెట్టుకోలేదని, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామన్నారు. గవర్నర్ పదవి ఆఫర్ చేస్తే రజనీ తప్పకుండా దాన్ని స్వీకరిస్తాడని తెలిపారు.
