సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 5 ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ, సమంత జంట కృషి ఫలించి ఖుషి రూపంలో మ్యూజికల్ హిట్ వచ్చింది, వారి తాజా చిత్రం ఖుషి. సెప్టెంబర్ 1న విడుదలైన మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హిట్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ కాశ్మిర్ మంచు కొండల అందాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖుషి మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లోనే రూ.70.23 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ?మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇక భీమవరంలో గత 3 రోజులు లో టౌన్ మొత్తంపై 16 లక్షల గ్రాస్ కలెక్షన్ వసూళ్లు చేసింది, నేడు, సోమవారం నుండి వసూళ్లు తగ్గే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం పద్మాలయా, మల్టి ఫ్లెక్స్ లలో కలపి 2 థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు.
