సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం మీడియా తో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత అవినీతిపరుడు, అత్యంత నమ్మకద్రోహి అని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని దోచుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ .. తాను అవినీతి చేసి అవతల వారిని అవినీతి కేసులలో ఇరికించడంలో నేర్పరి అని.. అయితే ఇటీవల చంద్రబాబు కేంద్ర ఐటి అధికారులకు ఆధారాలతో సహా అవినీతి సొమ్ము కు లెక్కలు చెప్పకుండా దొరికేసాడని.. అమరావతి పేరుతో రూ.118 కోట్లు దోచుకున్న దొంగ ను గుడ్డలు ఊడదీసి .. విచారిస్తే మరింత పెద్ద అవినీతి కేసుల చిట్టా బయటపడుతుందని ఆరోపించారు. అందుకే అమిత్ షా కాళ్లు పట్టుకున్నాడు.. ఆ అవినీతి కేసులకు భయపడే కేంద్రంలోని బీజేపీ పెద్దలను పార్టీ పొత్తుల కోసం నా.. తున్నాడని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి. ఇప్పుడు మరల బీజేపీని వాడేసుకుంటాడు, మళ్లీ కాంగ్రెస్ జెండా పట్టుకుంటాడన్నారు. వచ్చే ఎన్నికలలో 5వేల కోట్ల రూ.అవినీతి సొమ్ము టీడీపీ అభ్యర్థులకు ఖర్చుపెడతానికి సిద్దపడుతున్నాడని, నిజానికి చంద్రబాబులా తాము ఖర్చు చేస్తే 2014లోనే వైసీపీ అధికారం లోకి వచ్చి ఉండేదన్నారు. 2 ఎకరాల పొలం ఆస్తి తో తిరుపతి బస్టాండ్ లో ఖర్జురా పళ్ళు అమ్ముకొన్న చంద్రబాబు కు సింగపూర్ లో స్టార్ హోటల్స్ ఎలా వచ్చాయో? ..అని కొడాలి తనదైన మాటల తీరుతో విమర్శించారు.
