సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం మధ్యాహ్నం భీమవరం- ఉండి రోడ్డులోని కోట్ల ఫంక్షన్ హాలులో ఆక్వా రైతులతో నారా లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను కొందరు ఆక్వా రైతులు లోకేష్‌కు వివరించారు. రైతులు వినతి పత్రం ఇచ్చారు. అందులో.. ఇటీవల ఆక్వా ఫీడ్ రేటు బాగా పెరిగింది, కనీస మద్దతు ధర రాక ఆక్వా హాలిడే ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల విద్యుత్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకు కేవలం రూ.1.50 విద్యుత్ అందజేస్తాం అని చెప్పి కూడా తీరా యూనిట్‌కి రూ.3.50 వసూలు చేస్తున్నారు. కొత్తగా చేపల చెరువు తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ’’ అని పిర్యాదులు చేసారు. తదుపరి నారా లోకేష్ వారినుద్దేశించి మాట్లాడుతూ.. జగరొనా వైరస్ వల్ల ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని .. ఆక్వా ఎగుమతులకు అగ్రస్థానం లో ఉండే ఈ ప్రాంత రైతులు ఆక్వా క్రాఫ్ హాలిడే ప్రకటిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందోనని.. జగన్ ప్రభుత్వంలో విద్యుత్ ధరలు విపరీతంగా పెంచి రైతులను దోచుకుంటున్నారు. ఖాళీ చెరువులకి కూడా వేలల్లో బిల్లులు వస్తున్నాయి. ఇక్కడ ఆక్వా రైతులకు పెట్టుబడి పెరిగింది కానీ రొయ్య రేటు పెరగడం లేదు. జగన్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది.విదేశీ మారకద్రవ్యం తీసుకొచ్చే ఆక్వారంగాన్ని జగన్ నిర్లక్ష్యం చేశారు’’ అని తెలుగు దేశం అధికారంలోకి రాగానే కోతలు లేకుండా సబ్సిడీ ఫై కరెంట్ సరఫరా చేస్తామని, ఆక్వా రైతుల కు ఏది మంచిదైతే అదే చేస్తామని హామీ ఇచ్చారు. తదుపరి నేటి సాయంత్రం భీమవరం నియోజకవర్గం లో కి అడుగు పెట్టిన నారాలోకేష్ కు భారీ గజమాలలతో స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు.
