సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రకాశం చౌక్ లో టీడీపీ యువగళం లో భాగంగా నారాలోకేష్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన పాదయాత్రలో ఈ ప్రాంత ప్రజలు ఆక్వా రైతులు చేసిన విన్నపాలు తాను అర్ధం చేసుకొన్నానని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే నని , మహిళలకు ప్రతి ఇంటికి 3 వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని, ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తామని, ఆక్వా రైతులకు అందరికి ఎన్ని ఎకరాల చెరువులు ఉన్న ఒకే స్లాబ్ క్రింద యూనిట్ కరెంట్ 1- 50 కె ఇస్తామని వరుసగా హామీల వర్షం కురిపించారు. తదుపరి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫై తీవ్ర స్థాయి విమర్శలు ఆరోపణలు చేసారు. అక్కడ జగన్ సైకో అయితే ఇక్కడ గ్రంధి శ్రీనివాస్ గజదొంగ, భూ బకాసురుడు క్యాన్సర్ గడ్డ అంటూ విమర్శించారు. పేదల సెంటు ఇంటిస్థలాల కోసంభూములు కొనుగోలు లో ఆయన 50 కోట్ల అవినీతి కి పాల్బడితే స్థానిక వైసిపి నేతలే సీఎం జగన్ దృష్టికి తీసుకొనివెళ్ళారని ఆరోపించారు. ఇక్కడ అభివృద్ధి అన్నదే కానరావడంలేదని, ఒక్క రోడ్డు వెయ్యలేకపోయారని తాము అధికారంలోకి వస్తే భీమవరం అంతా కొత్త రోడ్డులు వెయ్యిస్తామని, గత మారు భీమవరం ప్రజలు ఎదో పొడిచేస్తాడని గ్రంధి శ్రీనివాస్ ని గెలిపించారని ఎం పీకాడు…? మరోసారి ఎన్నికలలో తప్పు చెయ్యకండని నారా లోకేష్ తనదయిన తీరు తో విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *