సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రకాశం చౌక్ వద్ద సీఎం జగన్ కు సంబంధించి ‘పేదలకు పెత్తందార్లు కు .. భారీ ఫ్లెక్సీ ని నేటి ఉదయం కొందరు చింపేయడంతో వైసిపి నేతలు అదే స్థానంలో మరో ఫ్లెక్సీ ని ఏర్పాటు చెయ్యడంతో నేటి మంగళవారం సాయంత్రం యువగళం పాదయాత్ర లో భాగంగా నారా లోకేష్ అక్కడికి చేరుకొంటున్న నేపథ్యంలో కొందరు టీడీపీ మద్దతు దారులు మరల కొత్తగా కట్టినజగన్ ప్లెక్సీ’ ఫై రాళ్ళూ విసిరి అదే స్థానంలో బాబాయ్ హంతకుడు .. అంటూ మరో ఫ్లెక్సీ ని కట్టడానికి ప్రయత్నించడంతో అక్కడ పోలీసులు వారిని అడ్డుకోవడం తో తీవ్ర త్రోపులాట జరిగింది… లోకేష్ యువగళం బహిరంగ సభ లో ఎమ్మెల్యే ను తీవ్ర స్థాయి పదజాలంతో విమర్శించినప్పటికీ వైసిపి వర్గాలు కూడా అక్కడ ప్రతిఘటించాలని ప్రయత్నించి నప్పటికీ వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు.. ఆవేశపడకండి.. రేపు మీడియా సమావేశంలో మాట్లాడదాం అంటూ స్థానిక ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ వైసిపి పార్టీ క్యాడర్ ను తన ఆదేశాలతో సమన్వయ పరిచినట్లు తెలుస్తుంది. ఇటువంటి ఉద్రిక్తత ల మధ్య లోకేష్ యువగళం బహిరంగ సభ ప్రశాంతంగా ముగియడం తో పోలీస్ వర్గాలుకు ఉపశమనం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *