సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో జరిగిన ఉద్రిక్తత లు దాడులు నేపథ్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నేడు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతి కట్టడాలతో కోట్లు కమిషన్ లు కొట్టేసి దొంగలుగా దొరికిపోయిన చంద్ర బాబు తనకు కేంద్ర ఐటీ నోటీసుల ఇచ్చిన అంశాన్ని దృష్టి నుండి మరలించేందుకు భీమవరంలో అరాచకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. లోకేష్ పాదయాత్ర కు కూడా తెచ్చుకొన్న సుమారు 200 మంది ఎర్ర చొక్కాలు వేసుకొన్న గుండాలు..తప్ప ప్రజలు రాకపోవడం తో నిరాశతో తన యాత్రకు కవరేజ్ రావడానికి ఇటువంటి దాడులు చేయిస్తున్నాడని, ఫెక్సీ లు చింపిస్తూ రెచ్చగొడుతున్నాడని.. సరే జనం రాక ఎదో రెచ్చగొడుతున్నాడు ఒకరోజు ఆగితే.. నడుచుకొంటూ పోతాడు అని ఉరుకొంటే, నిన్న బహిరంగ సభలో.. దొంగనోట్లు మార్చే వారిని పక్కన పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు సీఎం జగన్ ను నన్ను తిట్టాడు.. గత రాత్రి తన గుండాలతో గునుపూడి ప్రాంతంలో ప్రజలను పోలీసులపై దాడి చేయించాడు.. అంటూ సెల్ లో వీడియో ఫుటేజ్ .. ఫోటోలను ఆధారాలుగా చూపించారు.. భీమవరంను జిల్లా కేంద్రంగా సాధించి.. ఎన్ని వందల కోట్లతో అభివృద్ధి చేసానో.. ప్రతి వార్డులో ఎన్ని రోడ్డులు వేయించానో, ఎన్ని వంతెనలు కట్టించానో ,ఎన్నివేల ఇళ్ళు స్థలాలు పంపిణీచేసానో ఇక్కడి ప్రజలకు తెలుసు.. ఈ పప్పు .. కు తెలుసా? స్థానిక టీడీపీ నేతలను కూడా హెచ్చరిస్తున్నాను .. ఎన్నికల తరువాత రాజకీయాలు చెయ్యను.. మీతోను ఆత్మీయుడుగా ఉంటానని అందరికి తెలుసు.. మరి పప్పు.. కు లోకల్ లో 52 కోట్ల దోపిడీ జరిగినట్లు ఆధారాలు లేకుండా మీరు కాగితాలు రాసి ఇచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ టీడీపీ ఎమ్మెల్యే భూములు దోచేశాడు.. మీ మునిసిపల్ చైర్మెన్ ప్రజలు సొమ్ము అవినీతి చేసాడు.. నేను కాదు.. అవన్నీ చెప్పమంటారా?మంచి నీటి చెరువు కోసం 120 ఎకరాలు, టిడికో ఇళ్ల నిర్మాణానికి మరో 83 ఎకరాలు గతంలో ఎమ్మెల్యే గా సేకరించాను.. ఇప్పుడు పేదల ఇళ్ల కోసం వందల ఎకరాలు అవినీతి లేకుండా సేకరించి ఇచ్చాను మీ టీడీపీ వల్ల దోపిడీ తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదు అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *