సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 రోజులుగా భీమవరంలో కృష్ణాష్టమి పర్వదినాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిన్న గురువారం రాత్రి వాడవాడలా ఉట్టి కొట్టే ఆటపాటలతో ప్రసాద వితరణలతో బహుమతి ప్రధానాలతో సందడిగా కృష్ణాష్టమి వేడుకలు ముగిసాయి. అయితే కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా హరే కృష్ణ… భీమవరం పట్టణంలో యూత్ క్లబ్ రోడ్డులో కే కన్వన్షన్ లో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకలలో భారీ బృందావనం సెట్ లలో అందమైన పుష్ప అలంకరణలతో పలు ఆధ్యాత్మిక, నాటక, సాంస్కృతిక, కీర్తన, ప్రవచనాల కార్యక్రమాలతో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను అర్ధరాత్రి వరకు అత్యంత ఘనంగా నిర్వహించారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. వచ్చిన భక్తులందరికీ పంచభక్ష పరమణాలతో ప్రసాద వితరణ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కృష్ణ భక్తులు అందిస్తూనే ఉన్నారు. ప్రసాదాలు కృష్ణ చైతన్య పుస్తకాలు, 2024 క్యాలెండరు అమ్మకాలు, ఆబాల గోపాలం కోలాహలం అదో అద్భుత కృష్ణ ప్రపంచం.. గొల్లల కోడేరు రోడ్డులో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఇస్కాన్ మందిరానికి పలువురు దాతల నుండి విశేషంగా లక్షలాది రూపాయల కానుకలు అందాయి. తదుపరి, నేడు శుక్రవారం ఉదయం శ్రీల ప్రభుపాద వ్యాస పూజ ను నిర్వహించారు.
