సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో దంతులూరి నారాయణరాజు కళాశాలలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యస్.శాంతకుమారి తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్ద జనరల్ మేనేజర్ శ్రీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో 10 వ తరగతి మొదలు కొని ఇంజనీరింగ్ స్దాయి వరకూ ఆయా కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు ఈ ప్రాంగణ ఎంపికలలో పాల్గొనవచ్చునన్నారు. ఈ క్యాంపస్ ఉద్యొగ ఎంపికల కార్యక్రమం 13 వ తేది ఉదయం 9:30 ని. ప్రారంబమవుతుంది. కళాశాల పాలకవర్గ కార్యదర్సి కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) మాట్లాడుతూ పశ్చిమగోదావరి , ఏలూరు జిల్లాలోని వివిధ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఈ జాబ్ మేళా విషయాన్ని తమ ప్రస్తుత మరియు పూర్వ విద్యార్ధులకు తెలియపరచి వారందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొనే విధంగా సహకరించమని కోరుతున్నారు. పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ.. 13 వ తేదీన నిర్వహించే ఈ జాబ్ మేళాకు DNR కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలియజేస్తూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్పినియోగ పరుచుకోవాలని కోరారు.
