సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి జిల్లాలో నేడు, శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నగరి మండలం ధర్మాపురం వద్ద ఓ లారీ బీభత్సంతో ఐదుగురి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి వ్యాను, కారు, బైకుతో పాటు జాతీయ రహదారిపై మార్కింగ్ వేస్తున్న నలుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికిక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో నలుగురికి తీవ్రంగా గాయపడగా.. నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *