సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీ నేడు, శుక్రవారం అమెరికా అడ్జక్షుడు బిడెన్ ,బ్రిటన్ ప్రధాని ఋషి తో సహా 20 దేశాల అధినేతలు ప్రతినిధులు తో సందడిగా ఉంది. వీరందరితో విడివిడిగా ను మరియు సదస్సులోను ప్రధాని మోడీ సమావేశం అవుతారు. ప్రతిష్టాకరమైన జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ మన భారత్ కు రావడం ఇదే తొలిసారి. జో బైడెన్ నేటి రాత్రి ప్రధాని మోడీ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించనున్నారు. జేఈ జెట్ ఇంజిన్ ఒప్పందం , అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు, 5జీ, 6జీ స్పెక్ట్రమ్, వంటి అధునాతన సాంకేతికతల అభివృద్ధికి అణురంగంలో పురోగతి తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *