సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో( 371కోట్ల కుంభకోణం…) అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. నేటి శనివారం ఉదయం నంద్యాలలో హైడ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఆపై విజయవాడకు తరలించే యత్నం చేసింది. తన కాన్వాయ్ లోనే వస్తానని చెప్పడంతో అధికారులు అంగీకరించారు. మొదట టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి అడ్డుకునే యత్నం చేశారు. అయితే అధికారుల వివరణతో చివరకు అరెస్టుకు అంగీకరించారాయన. తదుపరి చంద్రబాబును విజయవాడకు తరలించారు. చం ద్రబాబు వెంట కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. తొలుత విజయవాడలోని సీఐడీ కార్యా లయానికి చంద్రబాబును తరలిస్తారని సమాచారం. ఆపై సీఐడీ పోలీసులు, మూడో అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబు నాయుడ్ని హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. కొద్దీ రోజులుగా కేంద్ర ఇన్కమ్ టాక్స్ కేసు కూడా చంద్రబాబు ను వెంటాడుతుండటం గమనార్హం..
