సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో సాక్ష్యదారాలతో నిఘా సంస్థలకు దొరికేసాడని అయితే అరెస్ట్ బాగా ఆలస్యం అయ్యిందని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. నేడు, శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో వేల కోట్ల రూపాయలు దోచేసిన చంద్రబాబు ఏకంగా 20కి పైగా కేసులలో కోర్ట్ నుండి స్టేలు తెచ్చుకొని దర్యాప్తులు ఆపించుకొని బయటపడటం అందరిని విస్మయానికి గురి చేసేదని కానీ ఇన్నాళ్లకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ కావడం తో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అందుకే ఆయన అరెస్ట్ తరువాత కూడా రాష్ట్రంలో ఎక్కడ ఆందోళనలు లేవని ఎవరి పనులు వాళ్ళు చేసుకొంటున్నారని, ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. ఇంకా కేంద్ర ఐటీ కేసు లో చంద్రబాబు 118 కోట్ల కమిషన్ కొట్టేశాడని ఆధారాలతో సహా నిరూపించారని ఆయన పాపాలు పండాయన్నారు. అన్ని ఆధారాలు ఉన్న సీఎం జగన్ అధికారంలోకి వచ్చి కూడా చంద్రబాబు లాంటి అవినీతిపరుడిని అరెస్ట్ చెయ్యకుండా 4న్నర ఏళ్ళు నిరీక్షించారంటే నాకు అర్ధం కావడం లేదన్నారు. అయితే అందరు ఊహించినట్లే.. ఇప్పడు దత్తపుత్రుడు పవన్ బయటకు వచ్చి చంద్రబాబును సీఐడి అరెస్ట్ చేసిన తీరు బాగోలేదని ఇది అన్నాయం, అటువంటి పెద్ద మనిషిని ఏ ఆధారాలు తో అరెస్ట్ చేసారని? బాధపడుతున్నాడని ఎద్దేవా చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *