సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని.. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే ఈ అరెస్ట్ జరిగిందని పవన్ ఆరోపించారు. ఎన్నో ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి ప్రత్యక విమానం లో విజయవాడలో చంద్రబాబును కలవాలని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం కుటుంబసభ్యులకు మాత్రమే ఆయన్ను కలిసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వొద్దంటూ గన్నవరం విమానాశ్రయం అధికారులను ఏపీ పోలీసులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *