సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు వారికీ సుపరిచితమైన సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా జంటగా ప్రస్తుత తమిళనాడు సీఎం,మరియు స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమవుతోన్న తాజా యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సిగ్మా’ (Sigma). తెలుగులో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘సంజయ్ వాళ్ల తాతగారు ఎస్.ఎ. చంద్రశేఖర్ నాతో ‘చట్టానికి కళ్లులేవు’, ‘దేవాంతకుడు’ వంటి అద్భుతమైన హిట్లు తీశారు.ఇక సినిమా టైటిల్ SIGMA గురించి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చిన్నప్పుడు ఆల్జీబ్రా చదివినప్పుడు మ్యాథమెటికల్ టర్మ్‌గా సిగ్మా అనే పదాన్ని విన్నాను. సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో అని గూగుల్ లో చూస్తే.. అది గ్రీక్ ఆల్ఫాబెట్స్‌లో 18వ అక్షరమని తెలిసింది. అంతేకాదు.. ఎవరి మాటా వినకుండా, తనకు నచ్చింది చేసుకుంటూ తన మార్గంలో తాను వెళ్లే వ్యక్తిని కూడా ‘సిగ్మా’ అంటారని తెలిసింది. బహుశా సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అదేనేమో! అందుకే జెన్-జీ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా వాళ్ల భాషలోనే ఈ టైటిల్ పెట్టారనిపించింది. కొసమెరుపు ఏమిటంటే..నిజానికి మన భీమవరంలో 34 ఏళ్ళ క్రితం 1992 అక్టోబర్ 24న ప్రారంభించబడిన ‘సిగ్మా’ కేబుల్.. తోలి లోకల్ న్యూస్ ఛానెల్స్, 24 ఏళ్ళు పాటు రాష్ట్రంలోనే పెను సంచలనం. 10 ఏళ్ళ క్రితం నుండి ‘సిగ్మా’ ఆన్ లైన్ న్యూస్ కూడా ఇదే పంధాలో కొనసాగడం గమనార్హం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *